విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ప్లాంట్ అడ్మిన్ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా నిర్వహిస్తున్నారు. సిఐటియు స్టీల్ గౌరవ అధ్యక్షులు అయోధ్య రామ్ మాట్లాడుతూ జీతాలు అందకపోవడంతో పలువురు ఉద్యోగులు అనారోగ్యానికి గురి అయినట్లు పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ యజమాన్యం వద్ద రూ. 1000 కోట్లు నిధులు ఉన్నా ఎందుకు జీతాలు చెల్లించడం లేదని ప్రశ్నించారు.