విశాఖ తూర్పు నియోజక వర్గం పరిధిలోని పంది మెట్ట ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు వ్యతిరేకిస్తూ ఆదివారం ఆందోళనకారులు వంటా వార్పు నిర్వహించారు. ఐద్వా నాయకురాలు కే. మణి ఆద్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ పూర్తి నివాస గృహాల మధ్య కొందరి స్వార్ధ ప్రయోజనాల కోసం మద్యం దుకాణం ఏర్పాటు చేశారని, శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందన్నారు.