అవగాహనా లేమి, భయం, సామాజిక అపోహలు, ఆర్థిక పరిస్థితుల వల్ల దేశంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రొమ్ము కేన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, ముందస్తు పరీక్షలతో వాటిని నియంత్రించవచ్చని విశాఖలోని విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె. రాంబాబు అన్నారు. రొమ్ము కేన్సర్ అవగాహనా మాసోత్సవాల సందర్భంగా మంగళవారం విమ్స్‌లో రొమ్ము కేన్సర్ నిర్థారణ, అవగాహన వైద్యశిబిరం నిర్వహించారు.