విశాఖపట్నం పీఎం పాలెంలో ఉన్న ఏసీఏ– వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు ఆంధ్ర, హిమాచల్‌ప్రదేశ్ మధ్య రంజీ మ్యాచ్ నిర్వహించనున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కార్యదర్శి సానా సతీష్ బాబు గురువారం తెలిపారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ మ్యాచ్‌కు ఆంధ్ర నుంచి ఎస్. కె. రషీద్, హిమాచల్‌ప్రదేశ్ జట్టుకు రిషి దావన్ సారథులుగా వ్యవహరించనున్నారని వెల్లడించారు.