రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని విద్య, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. విశాఖ లో బుధవారం సిఐఐ నిర్వహించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమిట్ లో పాల్గొన్న విద్య, ఐటి శాఖ మంత్రి లోకేష్ మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేస్తామన్నారు. విజయవాడ వరదలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం మోపిందన్నారు.