AP: ఇంటర్ విద్యార్థుల హాజరుపై బోర్డు కార్యదర్శి కృతికాశుక్లా క్లారిటీ ఇచ్చారు. రెగ్యులర్ విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలన్నారు. 75 శాతం కంటే తక్కువ ఉంటే అపరాధ రుసుము చెల్లించాలని పేర్కొన్నారు. 60-65 శాతం ఉంటే రూ.2 వేలు, 65-70 శాతం ఉంటే రూ.1500, 70-75 శాతం ఉంటే రూ.1000 అపరాధ రుసుము చెల్లించాలన్నారు. 60 శాతం కంటే హాజరు తక్కువగా ఉంటే.. సైన్స్ విద్యార్థులు పబ్లిక్ పరీక్షలు రాయడానికి అనర్హులని పేర్కొన్నారు.