మాటు వేసి.. కాటేస్తున్నారు!

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ జంట భార్యాభర్తలు కాదని తెలుసుకున్న దుండగులు, పక్కా ప్లాన్‌తో మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. గతంలోనూ తెలుగు రాష్ట్రాలలో ఈ తరహా అత్యాచారాలు అనేకం చోటుచేసుకున్నాయని తెలుస్తోంది. గంజాయి, మద్యానికి అలవాటు పడిన కొందరు యువకులు ముఠాగా ఏర్పడి, గ్రామాల్లోని అమ్మాయిలను, ఒంటరిగా ఉండే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని వెలుగులోకి రావడం లేదని సమాచారం. బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేసేలా, మృగాలకు కఠిన శిక్షలు పడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி