హన్వాడ: లాభాల బాట పట్టింది తెలంగాణ వ్యవసాయం: ఎమ్మెల్యే యెన్నం

హన్వాడ మండలం, వేపూర్ గ్రామంలోని రైతు వేదిక దగ్గర గురువారం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ భూమిని నమ్ముకుని జీవనం సాగిస్తూ, అందరికి అన్నం పెట్టే రైతు క్షేమంగా ఉండాలని ప్రజా ప్రభుత్వం కోరుకున్నది కాబట్టి రైతులను రుణ విముక్తులను చేసిందని ఆయన స్పష్టం చేశారు. రైతు సంతోషంగా ఉన్నప్పుడే సమాజం సంతోషంగా ఉంటుందని ఆయన అన్నారు.

தொடர்புடைய செய்தி