నారాయణపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్క్ ధర్నా సెంటర్లో సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె 11వ రోజుకు చేరుకున్నాయి. ఆదివారం గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ.. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, మహిళలకు ప్రసూతి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.