ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం స్టేజి వన్ రిటర్నింగ్ ఆఫీసర్స్ శిక్షణలో భాగంగా గ్రామపంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధంగా ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.
సూర్యాపేట జిల్లా కోదాడలో రిటర్నింగ్ అధికారులకు శిక్షణలో భాగంగా జిల్లా కలెక్టర్ హాజరై అవగాహన కల్పించారు. మండలంలో 475 గ్రామ పంచాయితీలు, 4322 వార్డు ఉన్నాయి అని. ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని. జూలై ఫస్ట్ వీక్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ ప్రారంభమై మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతాయని. 2 pm నుంచి కౌంటింగ్ ఉంటుందని ఆయన తెలిపారు. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు RWS, అగ్రికల్చరల్ అధికారులకు డ్యూటీలు మినహా ఇస్తున్నామని మిషన్ భగీరథ కాకతీయ పనులకు ఆటంకం కలగకుండా బాధ్యతలు ఇవ్వటం లేదని ఆయన తెలిపారు. అన్ని గ్రామాలలో ప్రశాంతంగా ఎన్నికలు జరుపుకోవాలని సూచించారు
ఏడూ కొండల వాడి సాక్షిగా దేవుడు ఉన్నాడు అని నిరూపించిన భక్తుడు
సూర్యపేట జిల్లా హుజూర్నగర్ మండలం లకారం గ్రామానికి చెందిన కొంపల్లి కనకా రెడ్డి మే 25 తారీఖున 30మంది కోలాట బృందాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి తీసుకువెళ్లాడు. శ్రీవారి దర్శనం, స్వామివారి ఊరేగింపులో కోలాటం
వేసేటప్పుడు కనకా రెడ్డి కి చెందిన పర్సు పోయినది. అందులో పది వేల రూపాయల నగదు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కార్డు ఉన్నవి . ఆ పర్సు కోదాడ వాసి కమతం వెంకటేశ్వర్లుకు దొరికింది దర్శనం అయ్యాక ఓపెన్ చేసి అందులో ఉన్న ఆధార్ కార్డు ప్రకారం అతని సెల్ నెంబర్ సేకరించి, ఆరా తీసి నిర్ధారించుకుని ఈరోజు పబ్లిక్ క్లబ్ లో రెడ్డి సంఘం అధ్యక్షులు మాజీ పబ్లిక్ కార్యదర్శి రెడ్డి గారి చేతుల మీదుగా కనకా రెడ్డి కి అందజేశారు