సెల్ఫీ మోజులో ప్రాణాలు పోగొట్టుకున్న యువతి(వీడియో)

69பார்த்தது
మెక్సికోలోని హిడాల్గోలో ఆవిరి ఇంజిన్ తో నడిచే రైలు ప్రత్యేకమైనది. అది వచ్చే క్రమంలో చాలామంది ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు ఎగబడుతుంటారు. తాజాగా ఓ యువతి సెల్ఫీ మోజుతో అత్యుత్సాహం ప్రదర్శించి ప్రాణాలు పోగొట్టుకుంది. ఆ రైలు వస్తుండగా దాని దగ్గరగా వెళ్లి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించగా అది ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించింది. ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది. రైలు వచ్చే ముందు ట్రాక్లకు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

தொடர்புடைய செய்தி