ప్రియుడితో బ్రేకప్ అయ్యాక మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ జాంజ్ గిర్-చంపా జిల్లా నవాగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మిస్దా గ్రామానికి చెందిన అంకుర్ నాథ్ (19) అనే యువతి ఇటీవల ప్రియుడితో విడిపోయింది. ఆ బాధలో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఇక ఆమె తల్లిదండ్రులు జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్‌లో కూలి పనులు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.