యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ యాదాద్రి జిల్లాకు మంచి నీటి సరఫరా లైన్ నిర్మాణం కోసం రూ. 200కోట్ల వ్యయంతో నిర్మించే ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని అన్నారు. మూసి నది పునర్జీవన పాదయాత్రకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు.