కాంగ్రెస్ ప్రభుత్వం రాక తర్వాత భువనగిరికి మహర్దశ వచ్చిందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. నూతన ఎలక్ట్రిక్ లైన్ షిఫ్టింగ్ పనులను గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. గత ప్రభుత్వాలు విస్మరించిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజా ప్రభుత్వంలో నిధులు మంజూరయ్యాయని భువనగిరి సుందరీకరణ ఆధునికరణ విషయంలో రాజీ పడేది లేదని రెండు నెలల్లోగా పనులను పూర్తి చేస్తామని అన్నారు.