సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి జిల్లాలో 8వ తేదీన తలపెట్టిన పర్యటనను విజయవంతం చేయాలని పార్లమెంటు ప్రజలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరిలో గురువారం పిలుపునిచ్చారు. బొల్లెపల్లి సంఘం బ్రిడ్జిపై సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. సీఎం, భీమ లింగాన్ని దర్శించుకుని ధర్మారెడ్డి కాలువ వరకు దాదాపు 2. 5 కిలోమీటర్ల పాదయాత్ర చేసేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు.