తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి దర్శనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని ఆయన దర్శనం చేసుకోనున్నారు. యాదాద్రి ప్రధానాలయంలో ఆలయ ఈవో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలకనున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు.