యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామ రెవెన్యూ పరిధిలోని రైతు బీమాకు దరఖాస్తు చేసకోని రైతులు రేపు తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలని కొలనుపాక వ్యవసాయ విస్తరణ అధికారి శివకుమార్ ఆదివారం పత్రిక ప్రకటనలో కోరారు. రైతు బీమా దరఖాస్తు చేసుకోవడానికి రేపే చివరి తేదీ కావున రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రైతు బీమా పథకంలో నమోదు చేసుకోగలరని విజ్ఞప్తి చేశారు.