ఆలేరు మండల కేంద్రంలోని కొలనుపాక గ్రామంలో రైతు దూడల సత్యనారాయణ సాగుచేసిన జీలుగ పచ్చిరొట్ట పంటను జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ మండల వ్యవసాయ అధికారి దీప్తి, వ్యవసాయ విస్తరణ అధికారి శివకుమార్ తో కలిసి పరిశీలించారు. జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ మాట్లాడుతూ రైతులు వరి వేయడానికి ముందు తప్పనిసరిగా పచ్చిరొట్ట పంటను సాగు చేయాలన్నారు.