లోక్ అదాలత్లో కేసుల రాజీ తర్వాత స్నేహపూర్వకంగా మెలగాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు ఎ. జయరాజు అన్నారు. శనివారం భువనగిరిలో కోర్టులో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో మాట్లాడారు.చట్టాలపై అవగాహన కల్పిస్తూ న్యాయ సేవాధికార సంస్థ సేవలను విస్తృతం చేశామని, లోక్ అదాలత్ బెంచీలతో కేసులు పరిష్కరించుకోవాలన్నారు. కేసును రాజీ చేసుకున్న దంపతులను అభినందించి వారికి రాజీ పత్రాలను అందజేశారు.