ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా మార్చి 9న దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియాను చాలా రికార్డులు ఊరిస్తున్నాయి. అలాగే చేదు జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. అయితే వాటన్నిటినీ దాటుకుని ఈసారి తగ్గేదేలే అనేలా రోహిత్ సేన జోరుగా ప్రాక్టీస్ చేస్తోంది. 1988లో కివీస్ జట్టుపై ఓ ఫైనల్లో భారత్ నెగ్గింది. ఇప్పటివరకు మరో టోర్నీలో ఇది జరగలేదు. ఇప్పుడు ఈ మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మకు అరుదైన అవకాశం వచ్చింది.