స్మగ్లింగ్‌ సినిమాను ఎందుకు ప్రోత్సహించారు? : సీపీఐ నారాయణ

51பார்த்தது
’తెలంగాణ ప్రభుత్వం స్మగ్లింగ్‌ సినిమాను ఎందుకు ప్రోత్సహించాలి’ అని సీపీఐ నారాయణ ప్రశ్నించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అసలు ‘పుష్ప-2’ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచుకోమని ఎందుకు అవకాశం ఇచ్చారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసుకోవాలని ఆ సినిమా సందేశం ఇస్తోంది. స్మగ్లింగ్‌తో పాటు అసభ్యకరమైన పాటలున్నాయి. అదేమైనా సమాజానికి ఉపయోగపడే సినిమానా?. పోలీసులు తీసుకున్న చర్యలు కరెక్టే’ అని నారాయణ తెలిపారు.

தொடர்புடைய செய்தி