BRS నేతలకు ఇవాళ ట్రైలర్ మాత్రమే చూపించామని.. త్వరలోనే సినిమా చూపిస్తామని CM రేవంత్ రెడ్డిఘాటు వ్యాఖ్యలు చేశారు. జనవరిలో వాడపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని చెప్పారు. హరీశ్, కేటీఆర్ దమ్ముంటే రావాలని సవాల్ విసిరారు. 30 రోజుల్లో మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ డిజైన్లు ఖరారవుతాయని తెలిపారు. మూసీ ప్రక్షాళనకు ఎవరైనా అడ్డొస్తే.. చరిత్ర హీనులుగా మారతారని విమర్శించారు.