మూసీ సుందరీకరణలో పేదలకు నష్టం కలిగిస్తామంటే సహించబోమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో కూరగాయాల మార్కెట్, సీసీ రోడ్డును ఆయన ప్రారంభించారు. అనంతరం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని పూజలు చేసి మాట్లాడారు. మూసీ సుందరీకరణకు మేం వ్యతిరేకం కాదని చెప్పారు. రూ.15 వేల కోట్లతో మూసీ సుందరీకరణ అవుతుందని.. రూ.లక్షన్నర కోట్లతో మూసీ పనులు చేపట్టడానికి తాము వ్యతిరేకమని చెప్పారు.