ఖాళీ బిందెలతో నీళ్ల కోసం ధర్నా
వర్ధన్నపేట ఇల్లంద గ్రామస్తులు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నీళ్ల కోసం ఖాళీ బిందెలతో బుధవారం ధర్నా చేశారు. గ్రామంలో ఐదు రోజులుగా తాగు నీరు సరఫరా కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. మిషన్ భగీరథ నీరు కూడా వారం రోజులుగా రావడం లేదని పేర్కొన్నారు. సింగిల్ ఫేజ్ బోరు మోటార్లు చాలా వరకు పనిచేయడం లేదని తెలిపారు. గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకర్ల నీరు ఏ మూలకు సరిపోవడం లేదని వాపోయారు.