వర్ధన్నపేట పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి ( డిఈఓ) జ్ఞానేశ్వర్, పాఠశాలలో అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలను పరిశీలించి ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 17 ఉపాధ్యాయులకు గాను 10మంది ఉపాధ్యాయులు హాజరై.. 7 గురు ఉపాధ్యాయులు పాఠశాలకు విధులకు డుమ్మా కొట్టి తప్పుడు లీవ్ లెటర్లు పెట్టిన ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయునికి నోటీసు జారీ చేశారు.