వర్ధన్నపేట మండలం కొత్తపెల్లి గ్రామంలో సోమవారం ఉచిత చేప పిల్లల పంపిణీ సందర్బంగా మత్స్యకారులు నిరసన, ధర్నా చేపట్టారు. సత్య నారాయణ ఫిషరీస్ చేప పిల్లల పంపిణి సంస్థ ప్రభుత్వం ఇచ్చిన సరైన ప్రమాణాల మేరకు చేప పిల్లలను ఇవ్వటం లేదని మత్స్యకారులు నిరసన చేపట్టారు. వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి మండలలకు చెందిన దాదాపు 68 సొసైటీల గ్రామాలకు చెందిన మత్స్యకార సొసైటీ సభ్యులు వెనుతిరిగి వెళ్లారు.