వరంగల్ మామునూర్ నుంచి ఆర్టీవో ఆఫీస్ జంక్షన్ వరకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్ సేఫ్టీ అధికారులతో సోమవారం ఆ పరిసర ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్, నేషనల్ హైవే అధికారులతో కలిసి ప్రాంతాలను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సందర్శించారు. ఈహైవే రోడ్డు ప్రమాదాలకు గల కారణాలను వెతికారు. ఇప్పటికే భారీగా ప్రాణనష్టం జరిగినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నివారణకు పలు సలహాలు సూచనలు చేశారు.