వర్ధన్నపేట ఇళ్లంద గ్రామంలో శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయంలో శనివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు జమ్మిపూజ చేసిన అర్చకులు రాత్రి తాళాలు వేసి వెళ్ళినప్పటికి, గేట్ ను వంచి రెండు హండీలను అపహరించారు. బీరువా తెరిచి చిందర వందర చేశారు. దేవాలయం వెనుక ఉన్న పంట పొలాల్లో హుండీ లను వేసి నగదు ఎత్తుకెళ్లారు.