లగిచెర్ల గిరిజన బాధితులను వెంటనే విడుదల చేయకపోతే ఎంత దూరమైనా వెళ్తామని సోమవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కేంద్రంలో గిరిజన ఆధ్వర్యంలో లగిచెర్ల బాధితుల కోసం జరిగిన ధర్నాలో బిఆర్ఎస్ మాజీమంత్రి ఎర్రబెల్లి, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తో కలిసి పాల్గొన్నారు. గిరిజనులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని వెంటనే విడుదల చేయాలని కోరారు.