వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో పంట ఉత్పత్తులు తెచ్చే రైతుల ఖాళీ బస్తాలు ఒక్కోదానికి రూ. 50ల చొప్పున ఖరీదు దారులు(వ్యాపారులు) చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని తెంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈమేరకు మార్కెట్ కార్యదర్శి నిర్మలను శుక్రవారం కలిసి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మార్కెట్ గ్రేడ్ -2 కార్యదర్శి రాము, రైతు సంఘాల నాయకులు ఓదెల రాజయ్య పాల్గొన్నారు.