వరంగల్ బల్దియా ఆవరణలో గ్రీవెన్స్
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం కమిషనర్ అశ్విని తనజీ వాకాడే ప్రారంభించారు. కాన్ఫరెన్స్ హాలు మరమత్తులు జరుగుతున్న నేపథ్యంలో కార్యాలయం ఆవరణలో ప్రత్యేక టెంట్లు వేసి వినతులు స్వీకరించారు. వారం రోజుల్లో వినితులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో బల్దియా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.