వరంగల్ రామన్నపేట నివాసి పాల నారాయణ అనారోగ్యంతో మరణించగా, సమాజ హితం కోరి, కుటుంబ సభ్యులు వైద్య విద్య నిమిత్తం కెఎంసీ మెడికల్ కాలేజీకి శుక్రవారం అప్పగించారు. ఈ పార్థివ దేహం తో వందల మంది వైద్య విద్యార్థులు వైద్య విద్యను నేర్చుకుంటారు, శాస్త్ర పరిశోధనకు కూడా తోడ్పడుతుందని అన్నారు. నేత్ర శరీర అవయవ దానాలు మానవాళికి మహా ఉపయోగాలని, మరణానంతరం అందరం శరీర దానాలు చేయడానికి ముందుకు రావలసిందిగా కోరారు.