TG: జీహెచ్ఎంసీ పరిధిలో హౌసింగ్ సొసైటీలకు భూకేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టుల సొసైటీలకు గతంలో ప్రభుత్వాలు భూకేటాయింపులు చేశాయి. వీటిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈక్రమంలో విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. ప్రభుత్వానికి సొసైటీలు కట్టిన డబ్బులు వెనక్కి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.