ప్రజలే వారికి సరైన శిక్ష విధిస్తారు: ప్రధాని మోడీ

82பார்த்தது
ప్రజలే వారికి సరైన శిక్ష విధిస్తారు: ప్రధాని మోడీ
రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిందని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. సోమవారం పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 'కొందరు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పని చేస్తున్నారు. ప్రజలు స్వీకరించకపోయినా పార్లమెంటుపై నియంత్రణకు యత్నిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు దేశ ప్రజలు వారికి సరైన శిక్ష విధిస్తారు. పార్లమెంటులో సానుకూల చర్చలు జరగాలని కోరుకుంటున్నా' అని అన్నారు.

தொடர்புடைய செய்தி