ఏపీలో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. సోమవారం ఎక్స్ వేదికగా.. ‘పత్తి ధరలు పడిపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. కొంత తేమ ఉన్న పత్తిని కూడా కొనుగోలు చేసేలా సీసీఐకి ఆదేశాలు ఇవ్వాలి.’ అని విజయసాయిరెడ్డి పోస్టు పెట్టారు.