నిత్యం నీటితో కళకళలాడే వరంగల్ భద్రకాళి చెరువులో చుక్క నీరు లేకుండా పోయింది. శుద్ది, సుందరీకరణలో భాగంగా ఈ నెల 8వ తేదీన చెరువులోని నీటి తరలింపును ప్రారంభించారు. చెరువులో 140 నుంచి 150 మిలియన్ క్యూబిక్ ఫీట్ల నీరు నిల్వ ఉండగా. ఆ నీటిని హసన్ఫర్తి నాగారం చెరువులోకి తరలించారు. బుధవారం నాటికి ఒండ్రు మిగిలింది. ఆ ఒండ్రును కూడా తీసివేయనున్నారు.