ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ మహారాష్ట్ర పీసీసీ చీఫ్ నానా పటోలే రాజీనామా చేశారు. లేఖను హైకమాండ్‌కు పంపించారు. అలాగే ఇవాళ సాయంత్రం ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలవనున్నారు. కాగా, ఈ ఎన్నికల్లో ఆయన సకోలి స్థానం నుంచి 208 ఓట్ల మార్జిన్‌తో గెలుపొందారు. తాజా ఎన్నికల ఫలితాల్లో మహా వికాస్ అఘాడి కూటమి ఘోర పరాజయం చెందిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ కేవలం 16 స్థానాల్లోనే విజయం సాధించింది.