మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ఏర్పాటు చేయనున్న మహిళా క్యాంటీన్లకు రాజకీయ గ్రహణం పట్టింది. అర్హత కల్గిన మహిళా సంఘాలకు దక్కాల్సిన క్యాంటీన్లు రాజకీయ నాయకుల పైరవీలతో అనర్హులకు దక్కుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో ఉన్న క్యాంటీన్ కు రంగులు వేశారు. మరమ్మతులు పూర్తి చేసి ఆరు నెలలు గడుస్తున్నా ఇంకా ఎవరు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు.