రాష్ట్రంలో మత్తు పదార్థాల కట్టడికోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలల్లో భాగంగా వరంగల్ నగరంలో నూతంగా ఏర్పాటు చేసిన నార్కోటిక్ పోలీస్ స్టేషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళోజి కళాక్షేత్రం ప్రాంగణంలో వర్చువల్ విధానంతో మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా నార్కోటిక్ విభాగం డైరెక్టర్ సందీప్ శాండిల్య, మహేష్ భగవత్, ఎస్పీ సాయి చైతన్య ముఖ్యమంత్రికి పుష్పాగుచ్చాలను అందజేశారు.