వరంగల్ అభివృద్దికి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 2050 జనాభాను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన మాస్టర్ ప్లాన్ తుది దశకు చేరుకుందని త్వరలో సీఎం చేతుల మీదుగా విడుదల చేస్తారని వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి శ్రీపొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళవారం వరంగల్, హన్మకొండ జిల్లాల అభివృద్ది కార్యక్రమాలపై మంత్రులు సురేఖ, పొన్నం లతో కలసి హైదరాబాద్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు.