ప్రజలు నియంతృత్వ పాలనకు చరమగీతం పలికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకుని డిసెంబర్ 7 నాటికి ఏడాది పూర్తి కానున్న శుభ సందర్భంలో నవంబర్ 19న హన్మకొండలో తలపెట్టిన ప్రజా పాలన విజయోత్సవ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు మంత్రి కొండా సురేఖ ఆదివారం ప్రజలకు పిలుపునిచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజా సంక్షేమానికి పునరంకితమవుతున్నదని అన్నారు.