పరీక్ష నిర్వహణలో కాకతీయ యూనివర్సిటీ పాలకవర్గం సమయపాలన పాటించడం లేదు. హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల యాజమాన్య నిర్లక్ష్యంగా వ్యవహరించింది. జర్నలిజం మొదటి సెమిస్టర్ పరీక్షలకు ఆలస్యంగా ప్రశ్నాపత్రాలు ఇస్తున్నారు. మొదటి రోజు పరీక్షకు 10 నిమిషాలు, శనివారం రెండవ రోజు పరీక్షకు 20 నిమిషాలు ఆలస్యంగా ప్రశ్నపత్రాలు ఇచ్చారు. ప్రశ్నాపత్రాలు ఆలస్యంగా ఇవ్వడం పై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల డిమాండ్ చేశారు.