వరంగల్ మహా నగరపాలక సంస్థలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు కమిషనర్ అశ్వినీ తానాజీ వాకేడే ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10. 30 గంటల నుంచి గ్రీవెన్స్ లో ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అధికారులు సకాలంలో గ్రీవెన్స్ కు హాజరుకావాలని ఆదేశించారు.