తెలంగాణ సాంస్కృతిక రంగానికి మరింత ఒరవడిని తీసుకొస్తూ హనుమకొండలో నిర్మితమైన కాళోజీ కళాక్షేత్రంను సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ కళాక్షేత్రం 4. 25 ఎకరాల విస్తీర్ణంలో, రూ. 95 కోట్ల వ్యయంతో నిర్మితమైంది. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు కుడా పర్యవేక్షణలో పూర్తి అయింది. ఈ కళాక్షేత్రం 1. 77 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడింది.