వరంగల్ డీఎంహెచ్ఓ వెంకటరమణ స్టాఫ్ నర్సు రిక్రూట్మెంట్లో మెరిట్ ఉన్న వ్యక్తుల వద్ద లంచాలు తీసుకున్నట్లు కలెక్టర్ ఫిర్యాదు చేశారు. పల్లె వెలుగు పోస్టింగ్ కోసం డాక్టర్ల నుంచి డబ్బులు తీసుకోవడం, కంటి వెలుగు ప్రోగ్రాంలో ప్రతీ యూనిటు ఒక వాహనాన్ని ఏర్పాటు చేసే దానిలో పూర్తి స్థాయిలో అవినితికి పాల్పడ్డాడని, వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు సోమవారం కలెక్టర్ సత్యశారదకు వినతిపత్రం అందజేశారు.