వరంగల్ ఇసుకఅడ్డా వద్ద శనివారం అర్ధరాత్రి మంచినీటి ప్రధాన పైపులైన్ పగిలింది. దీంతో పెద్దఎత్తున తాగునీరు వృథా అయ్యింది. అర్ధరాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు లీకేజీ వరద ఆగలేదు. తాగునీరు ఏరులై పారింది. ఇసుకఅడ్డా నుంచి మాజీ ఎమ్మెల్యే నరేందర్ ఇంటివరకు నీరు నిలిచింది.