వరంగల్ నగరంలో బాణసంచా అక్రమదందా జోరుగా సాగుతుందనే సమాచారంతో మంగళవారం రాత్రి టాస్క్ఫోర్స్ సిబ్బంది ఇంతెజార్ గంజ్ పోలీసులతో కలిసి బాణసంచా దుకాణాలపై దాడులు చేశారు. పాతబీట్ బజార్ లోని వజినేపల్లి రమేశ్, శ్రీసాయి ఫైర్ క్రాకర్స్ షాపుల్లో అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు రూ. 1. 80 కోట్ల బాణసం చాను గుర్తించి సీజ్ చేశారు.