వరంగల్ బస్ స్టాండ్ సమీపంలో గల ఏస్ఎన్ఎం జంక్షన్ వద్ద బల్దియా స్మార్ట్ సిటీ నిధులు రూ. 60 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన జంక్షన్ అభివృద్ది పనులను రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వర్దన్న పేట ఎమ్మెల్యే కే. ఆర్ నాగరాజు జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.