వరంగల్ శాకరాసికుంటలో నూతన బొడ్రాయి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో మంత్రి కొండా సురేఖ సోమవారం పాల్గొన్నారు. వేదపండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కమిటీ వారు అక్కడ ఏర్పాట్లను చక్కగా చేసారని మంత్రి అభినందించారు. అమ్మవారి దయ ప్రజలందరి పై ఉండాలనీ, అందరి జీవితాలు సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వెలుగొందాలని మంత్రి ఆకాంక్షించారు.