కల్లుగీత కార్మికుల భద్రతకే కాటమయ్య కిట్లు అందిస్తున్నామని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం వరంగల్ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో బీ సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కాటమయ్య రక్షణ కవచ కిట్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని జిల్లా కలెక్టర్ తో కలిసి కిట్లు పంపిణీ చేశారు. కల్లు గీత కార్మికుల ప్రాణాలకు ప్రజా ప్రభుత్వ అభయ హస్తం కాటమయ్య రక్షణ కవచమని అన్నారు.